రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్...ఈ పదం పేరుకే ..కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. కొందరు పోలీసులు..సామాన్యుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న కారణానికే చేయి చేసుకుంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. తాజాగా ఓ ఎస్సై ఇద్దరు యువకులను చితకబాదాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎస్సై ఫ్రెండ్లీ పోలిసింగ్ కు మచ్చ తెచ్చాడు. లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ ట్రైనీ ఎస్సై రాజమౌళి ఓవర్ యాక్షన్ చేశాడు. పోలీస్ స్టేషన్ బయట..వాహనదారులను ఆపుతున్న ఎస్సై రాజమౌళి..ఓ బైక్ పై ముగ్గురు యువకులు వెళ్తుండగా..ఆపాడు. వారు ఆపిన వెంటనే బైక్ డ్రైవ్ చేసే యువకుడిపై చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన చెంపపై కొట్టాడు. ఆ తర్వాత మధ్యలో కూర్చుకున్న వ్యక్తిపై కూడా చేయి చేసుకున్నాడు. అతని చెంప, మెడపై కొట్టాడు. ఎస్సై ప్రవర్తన ప్రస్తుతం వివాదస్పదంగా మారింది.
@బైకర్ ను కొట్టిన ఎస్సై pic.twitter.com/IZF5FdVrKA
— ravi (@risingsun143) August 30, 2023
ఎస్సై ప్రవర్తనపై ఆగ్రహం..
ఎస్సై రాజమౌళి ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్ పై ముగ్గురు వెళ్లడం కరెక్ట్ కాదని..కానీ ఇలా దురుసుగా ప్రవర్తించడం సరైన చర్య కాదని చెబుతున్నారు. నేరగాళ్లను కొట్టినట్లు కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎష్ పార్టీ ర్యాలీలో త్రిబుల్ రైడింగ్ చేస్తే ఎంత మందిపై దాడి చేసారని నిలదీస్తున్నారు.