
- పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్ష రాయనున్న12,282 మంది
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 21వ తేదీ నుంచి టెన్త్ ఫైనల్ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,282 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే, కొన్ని హైస్కూల్స్‌కు సంబంధించిన స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్సెంటర్లు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఆటోలు, బైక్‌లు, ఇతర వాహనాలపై ఎగ్జామ్స్‌కు వెళ్లే టైంలో ఏదైనా ప్రమాదానికి గురైతే తమ కష్టం వృథా అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 73 సెంటర్లు..
టెన్త్ ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 73 సెంటర్లు ఏర్పాటు చేశారు. దూరభారం వల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పినపాకకు శాంక్షన్అయిన జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి విద్యార్థులు ఎగ్జామ్స్ రాసేందుకు పినపాకకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇది మణుగూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 15 కిలోమీటర్ల దూరంలోని బోడుకు వెళ్లాలి. కోయగూడెం ఆశ్రమ పాఠశాలస్టూడెంట్స్5 కిలోమీటర్ల దూరంలోని టేకులపల్లికి, కుంటల హైస్కూల్ స్టూడెంట్స్5 కిలోమీటర్ల దూరంలోని బోడు ప్రాంతానికి వెళ్లి, ఎగ్జామ్స్రాయాలి.
పాల్వంచ మండలంలోని ఉల్వనూర్ బాలికల ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ 12 కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలి.
అశ్వాపురం మండలంలో ఏహెచ్ఎస్ గొందిగూడెం స్టూడెంట్స్ 10 కిలోమీటర్లు దూరం వెళ్లి, పరీక్షలు రాయాలి.
మైలారం హైస్కూల్ స్టూడెంట్స్ 12 కిలోమీటర్ల దూరంలోని రేగళ్లకు వెళ్లాలి.
పినపాక మండలంలోని దుగినేపల్లి స్టూడెంట్స్10 కిలోమీటర్ల దూరంలోని పినపాకకు, జానంపేట స్టూడెంట్స్8 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది.
ఇల్లెందు మండలంలోని కొమరాంర హైస్కూల్స్టూడెంట్స్15 కిలోమీటర్ల దూరంలోని రొంపేడుకు వచ్చి, ఎగ్జామ్స్రాయాలి.
ఆళ్లపల్లి మండలంలోని మార్కోడ్స్టూడెంట్స్10 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లపల్లికి, గుండాల మండలంలోని మామకన్ను స్టూడెంట్స్ 10 కిలోమీటర్ల దూరంలోని కాచనపల్లి వెళ్లి, పరీక్షలు రాయాలి.
అశ్వారావుపేట మండంలోని కావడిగుండ్ల స్టూడెంట్స్20 కిలోమీటర్ల దూరంలోని సున్నం బట్టి ఎగ్జామ్ సెంటర్‌కు, గుమ్మడివల్లి, నారాయణపురం స్టూడెంట్స్ పరీక్షలు రాసేందుకు10 కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఆర్టీసీ బస్సులు నడపాలి
పదోతరగతి పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హాల్ టికెట్ చూపిస్తే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసేలా చూడాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ స్టూడెంట్స్‌కు ఈ అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. బైక్‌లు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే పిల్లలు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. గతేడాది కిన్నెరసానిలో జరిగిన గేమ్స్‌కు అశ్వారావుపేటకు చెందిన విద్యార్థులు ట్రాలీలో వచ్చి, యాక్సిడెంట్‌కు గురయ్యారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఇబ్బంది పడతారు..
10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లి, ఎగ్జామ్రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఎండలు మండుతున్నాయి. ఆటోలు, ట్రాలీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.
- రాజు, యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ
ఆర్టీసీ ఆఫీసర్లకు లేఖ రాశాం
టెన్త్ ఎగ్జామ్స్‌కు ఏర్పాట్లు చేశాం. స్టూడెంట్స్కోసం బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఆఫీసర్లకు లేఖ రాశాం. ఏఎన్ఎంలు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చేలా చూడాలని వైద్యశాఖ అధికారులను కోరతాం.
- ఎస్.మాధవరావు, పరీక్షల సహాయ కమిషనర్, భద్రాద్రి కొత్తగూడెం