నవంబర్ 30 తరువాత బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదన్నారు మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క. ప్రజల సంపదను దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను వదిలించుకునేందుకు ప్రజల సిద్ధమయ్యారని తెలిపారు. మధిర మండలం రామచంద్రపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ప్రభంజనంలా వీస్తు్ందన్న భట్టి.. కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు. ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కు ప్రజా సమస్యల పరిష్కరించాలన్న సోయి ఉందా అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కావాల్సిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని.. ఇట్లాంటి హామీలు ఇచ్చి సంతకం పెట్టే దమ్ము మీకుందా? అని కేసీఆర్ ను ప్రశ్ని్ంచారు. పాలించేవాడిగా ప్రశ్నించే వాడిగా ఎక్కడ ఉన్న మధిర ఓటర్లు తలెత్తుకునేలా చేశానన్నారు భట్టి.