ఇంటింటా ముగ్గులు.. భోగి మంటలు

ఇండ్ల ముంగిట ముగ్గులు.. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భోగి, సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పల్లెపట్నం తేడా లేకుండా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో ఎండ్ల బండ్ల ఊరేగింపులు ఆకట్టుకున్నాయి. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, బెంగుళూరు, ఇతర నగరాల్లో ఉద్యోగ ఉపాధి కోసం వెళ్లిన వారంతా పండుగ పూట సొంతూళ్లకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి భోగి, సంక్రాంతి పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు.  --నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు