పిల్ల దొంగలు.. రూ.50 లక్షలు కొట్టేశారు.. ఆ తర్వాత..

పిల్ల దొంగలు.. రూ.50 లక్షలు కొట్టేశారు.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ వాడకం ఎక్కువయ్యే సరికి చెడ్డ పని చేయడం చాలా ఈజీ అయ్యింది. దొంగతనం, స్మగ్లింగ్ వంటివి ఎలా చేయాలని ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తూ కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు కేటుగాళ్లు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా సోషల్ మీడియా, వెబ్ సిరీస్ లు చూసి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంట్లో పని చేస్తాడులే అని మైనర్ బాలుడిని చేరతీస్తే లాస్ట్ కు యజమాని ఇంటికే కన్నం వేశాడు. సినిమాలు చూసిన ప్రభావం ఏమో కానీ అచ్చం సినిమా హీరో దొంగతనం చేస్తే పట్టుపడకుండా ఉండాలంటే ఏం ఏం చేయాలో అవన్ని చేశాడు. చివరకు పట్టుబడ్డాడు. ఇంతకు ఎక్కడంటే.. 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని ఓ డాక్టర్ ఇంట్లో పనిచేస్తున్న ఓ మైనర్ బాలుడు ఆ ఇంటికే కన్నం వేశాడు. తన స్నేహితులతో కలిసి పక్కాగా ప్లాన్ వేశాడు. సోమవారం రాత్రి అంతా పడుకున్న సమయంలో ఇంట్లోని సీసీ కెమెరాలను పని చేయకుండా డిసేబుల్ చేశాడు. తదుపరి తన స్నేహితులును పిలిచి దోపిడికి పాల్పడ్డాడు. రూ.50 లక్షల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలతో పరారయ్యాడు.  

ఇంటి యజమాని తెల్లరి లేచి చూసే సరికి ఇంట్లోని డబ్బు బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయే సరికి పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుల్లో ముగ్గురుని పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 47 లక్షలు రికవరీ చేశారు.

 మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ఇంటికి ఇరువైపుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశామని అందుకే దొంగలను సులభంగా పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు.  మరియు ప్రస్తుతం వెంబడిస్తున్నారు.