
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాండ్ యాక్టివేషన్ పనులు నిర్వహించు గదిలో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే అర్దరాత్రి సమయంలో ఈఘటన జరగడంతో సిబ్బందికి ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరిపారు..