వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టు లో ఊరట లభించింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో  అవినాష్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టు మే 03శుక్రవారం రోజున కొట్టివేసింది. ఇదే  కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు దస్తగిరి వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.  కాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.