జస్ట్ మిస్ : యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్...

జస్ట్ మిస్ : యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్...

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, తెలుగు నటి  శుభశ్రీ రాయగురు అక్టోబర్ 7న రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శుభశ్రీ స్వల్ప గాయాలతో బయట పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగార్జున సాగర్ సమీపంలో జరుగుతున్న షూటింగ్ కి శుభశ్రీ వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో అటు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు శుభశ్రీ కారుని ఢీకొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ఉండడంతో పెద్ద ముప్పు తప్పి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. శుభశ్రీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి.

ఇక శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు ముందరి భాగం ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ విషయం ఇలా ఉండగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మనోభావాలు పాప పేరుతో శుభశ్రీ బాగా పాపులర్ అయ్యింది. ఇటీవలే కాకినాడ ఖాజా అనే పాటలో నటించగా ఈ పాట ఆడియన్స్ ని బాగానే అలరించింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫోటోషూట్లు, రీల్స్ షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కాగా చివరగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన అమిగోస్ అనే చిత్రంలో నటించింది.