బీహార్‌లోని ఓ దళిత మహిళ.. తీసుకున్న అప్పుకు అదనపు వడ్డీని చెల్లించేందుకు నిరాకరించినందుకు గానూ ఆమెపై దారుణంగా దాడి చేసి వివస్త్రను చేశారు. అంతే కాదు వారి కొడుకు కూడా ఆమె నోట్లో మూత్ర విసర్జన చేశారని పోలీసులు తెలిపారు. పాట్నా జిల్లా మోసింపూర్ గ్రామంలో ప్రమోద్ సింగ్ వద్ద మహిళ రూ. 15వందలు అప్పుగా తీసుకుందని, దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించిందని పోలీసులు చెప్పారు.
అప్పుపై అదనపు వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ మహిళను కోరాడు. మహిళ నిరాకరించడంతో, ప్రమోద్ సింగ్, అతని కుమారుడు, వారి సహాయకులు ఆమెపై దాడి చేసి వివస్త్రను చేశారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని చేతిపంపు నుంచి నీళ్ల కోసం ఆ మహిళ బయటకు రాగా... సెప్టెంబర్ 23న రాత్రి ప్రమోద్, అతని కుమారుడు అన్షు, మరో నలుగురు వ్యక్తులు తమతో పాటు రావాలని బలవంతం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపింది.
ALSO READ : గణేష్ మండపాల్లో ముస్లింల అన్నదానం
అనంతరం ఆమెను కర్రలతో కొట్టి, గ్రామంలోని ఏకాంత ప్రదేశంలోకి తీసుకువెళ్లి వివస్త్రను చేశారని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ప్రమోద్ సింగ్ అన్షుని ఆమె నోటిలో మూత్రం పోయమని సూచించాడు. ఆ తర్వాత ఆమె అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటకు పరుగెత్తింది. ఈ క్రమంలో ఆమె వివస్త్రగా తన ఇంటికి పరిగెత్తినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు బలమైన గాయాలు కాగా, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.