జనగామ/ భూపాలపల్లి రూరల్/ నెక్కొండ, వెలుగు: ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారి జీవీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌వరకు బైక్ ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు.
జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో ట్రాన్స్పోర్ట్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలోకలెక్టరేట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కరే పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొని డ్రైవర్లకు డ్రైవర్లకు అవగాహన కల్పించారు.