నరేష్ అగస్త్య, నక్షత్ర జంటగా నానాజీ మిరియాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బాపట్ల ఎంపీ’. నందిగం వెంకట్ నిర్మాత. ప్రస్తుత బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిన్న ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో మూవీ ఓపెనింగ్ జరిగింది.
హీరో నరేష్ మాట్లాడుతూ ‘పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అని మొదట భయపడినా, ఆ తర్వాత ఓ సామాన్యుడు రాజకీయ నేతగా ఎదగడానికి ఎంత కష్డపడ్డాడు అనే పాయింట్ నచ్చింది. నటనకు అవకాశం ఉంటుందని నమ్మి ఈ సినిమా చేస్తున్నాను’ అన్నాడు. ‘పలాస 1978’ తర్వాత మళ్లీ అలాంటి నేటివిటీ ఉన్న కథలో నటించడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది నక్షత్ర.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఒక సామాన్య వ్యక్తి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంపీ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ప్రధాన కథ. అనూప్ రూబెన్స్, శ్యామ్ కె నాయుడు, మార్తాండ్ కె వెంకటేష్ లాంటి ప్రముఖ టెక్నీషి యన్స్ వర్క్ చేస్తున్నారు’ అని చెప్పాడు. ‘అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’ అన్నారు నిర్మాత వెంకట్.