బిట్​ బ్యాంక్​..భూ ప్రధాన విభాగాలు 

బిట్​ బ్యాంక్​..భూ ప్రధాన విభాగాలు 

    భూమి వెలుపలి పొరను భూ పటలం అంటారు. 
    భూమి పటలంలో అతి పుష్కలంగా దొరికే మూలకం సిలికాన్​.
    నిఫె అనే పదం భూమి మధ్య భాగానికి సంబంధించింది.
    భూమిపై అత్యధికంగా లభించే మూలకం ఆక్సిజన్.
     జిప్సమ్​, సుద్ద, సున్నపురాయి అవక్షేప శిలలకు ఉదాహరణ.
    పెట్రోలియమ్​ సాధారణంగా ఉండేది అవక్షేప శిల.
    భూ పటలాన్ని వేరు చేసేది మొహరోనిసిక్​ డిస్​కంటున్యుటీ.
    శిలల పుట్టుక గురించి తెలియజేసే శాస్త్రం పెట్రోజెనెసిస్​.
    యూరప్​ను ఆసియా ఖండం నుంచి వేరు చేసే పర్వతశ్రేణి ఉరల్స్​.
    ఉత్తర అమెరికా ఖండాన్ని దక్షిణ అమెరికా ఖండంతో అనుసంధానం చేసేది భూ సంధి.
    భూ వాతావరణంలో అత్యధిక భాగం ఉండే వాయువు నైట్రోజన్​.
    ఘనశిలలు కలిగి ఉండే భూ భాగం శిలావరణం.
    భూమి ఉపరితలంపై అతిపెద్ద భాగాన్ని ఆవరించి ఉన్న ఆవరణం జలావరణం.
    భూమిపై నేల, నీరు, గాలి కలిసి ఉండి అన్నిరకాల జీవ రూపాలను కలిగి ఉన్న ఒక సన్నని మండలం జీవావరణం.
    పర్వతశ్రేణులు, పీఠభూములు, ఎత్తయిన భూములు, పొడవాటి ఏటవాలు ప్రదేశాల సముదాయంతో కూడి గ్రేట్​ డివైడింగ్​ రేంజ్​ ఆస్ట్రేలియా ఖండంలో ఉంది.
    గ్రేట్​ శాండీ డిసర్ట్​ ఆస్ట్రేలియా ఖండంలో ఉంది. 
    ఆర్కిట్​ వలయం యూరప్ ఖండం గుండా వెళ్తుంది.
    భూ ఉపరితలానికి సమీపంలో ఉండి, అన్ని వాతావరణ పరిస్థితులను కలిగి ఉండే ఆవరణం ట్రోపోస్ఫియర్​. 
    ఓటోన్​ పొర స్ట్రాటోస్ఫియర్​ అనే వాతావరణ పొరలో ఉంది.
    విమానాలు స్ట్రాటోస్ఫియర్​ పొరలో ఎగురుతాయి.
    ట్రోపోస్ఫియర్​, మెసోస్పియర్​లో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అయితే, స్ట్రాటోస్ఫియర్​లో పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడానికి ఓజోన్​ పొర కారణం.
    భూ ఉపరితలంపై పీఠభూములు సుమారు 45 శాతం విస్తీర్ణంలో ఉన్నాయి.
    టిబెట్​ పీఠభూమి ప్రపంచంలోనే అతి తక్కువ వయస్సు, అత్యంత ఎత్తయిన, అతి పెద్ద పీఠభూమి.
    లావా పీఠభూములు అధిక శాతం ఉత్పాదకత కలగిన నల్ల మృత్తికలను కలిగి ఉంటాయి. 
    నల్ల నేలలు కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లను కలిగి ఉంటాయి. మొక్కజొన్న, పత్తి, రాగి, మిర్చి పంటలు సమృద్ధిగా  పండుతాయి.
    భూమి వాతావరణ పొరలన్నింటిలో వెలుపలి పొర ఎక్సోస్ఫియర్​.
    కర్కటరేఖ, భూమధ్యరేఖ, మకరరేఖ మూడూ వెళ్లే ఖండం ఆఫ్రికా.
    యురప్​, ఆసియా రెండింటి ఉమ్మడి భూభాగాన్ని యురేషియా అని పిలుస్తారు.
    రెండు భూభాగాలను కలిపే ఒక సన్నని భూపట్టిని భూ సంధి అని పిలుస్తారు. 
    భూమిలో 29 శాతం నేలతో ఆవరించి ఉంది.
    భూమిపై ఉన్న నీటిలో 97 శాతం పైగా సముద్రాల్లో ఉంటుంది.
    మైత్రీ, దక్షిణ గంగోత్రి అనే రెండు భారతీయ పరిశోధనా కేంద్రాలు అంటార్కిటికాలో ఉన్నాయి. 
    త్రిభుజాకారంలో ఉండే మహాసముద్రం హిందూ.
    భూమధ్యరేఖకు ఇరువైపులా ఉండే ఖండం ఆఫ్రికా.
    అతిపెద్ద మహా సముద్రం పసిఫిక్​. రెండో అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్​. మూడో అతిపెద్ద మహాసముద్రం హిందూ.
    ఉరల్​ పర్వతాలు యురేసియాలో ఉన్నాయి.
    ఆల్ప్స్​ పర్వతాలు యూరప్​ ఖండంలో ఉన్నాయి.
    అల్టాస్​ పర్వత శ్రేణి ఆఫ్రికా ఖండంలో ఉంది.
    డ్రాకన్స్​బర్గ్​ పర్వతశ్రేణి దక్షిణ అమెరికాలో ఉంది.
    నైలు నది ఆఫ్రికా ఖండంలో ఉంది.
    రాకీ పర్వత శ్రేణి ఉత్తర అమెరికా ఖండంలో ఉంది.
    ఆండీస్​ పర్వత శ్రేణి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది.
    అపలాచియన్ పర్వత శ్రేణి ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. 
    సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. 
    1953, మే 29న ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటగా అధిరోహించింది ఎడ్మండ్​ హిల్లరీ, టెంజింగ్ నార్గే షెర్పా.
    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు టెంజింగ్​ నార్గే షెర్పా.
    1975, మే 16న ఎవరెస్ట్​ను అధిరోహించిన మొదటి మహిళ జుంకో తాబే.
    1984, మే 23న మౌంట్​ ఎవరెస్ట్​ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రిపాల్​.
    సముద్ర మట్టం నుంచి పసిఫిక్​ మహాసముద్రంలోని మేరియానా ట్రెంచ్​ లోతు 11022 మీటర్లు.