
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్, సూర్యపేట జిల్లా ప్రెసిడెంట్గా శ్రీలత రెడ్డి, నిర్మల్ కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్, రాజన్న సిరిసిల్లాకు ఆర్.గోపిని నియమించినట్టు పార్టీ ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒక స్టేట్ కౌన్సిల్ సభ్యులనూ నియమించారు. ఇప్పటికే 23 జిల్లాలకు ప్రెసిడెంట్లను నియమించగా, తాజాగా ఐదు జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. దీంతో మొత్తం 38 బీజేపీ సంస్థాగత జిల్లాల్లో 28 జిల్లాల అధ్యక్షులను ప్రకటించినట్టు అయింది.
ఎమ్మెల్సీ ఎన్నికలపై రేపు సునీల్ బన్సల్ సమీక్ష
రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ స్టేట్ ఆఫీసులో గురువారం సాయంత్రం సమీక్షించనున్నారు. బుధవారం ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో, గురువారం ఉదయం నిర్మల్లో జరిగే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్నారు.