
- ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
నెట్వర్క్, వెలుగు: బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నేతలు ఘనంగా జరిపారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోనే దేశాభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోదీదేనని అన్నారు.
పార్టీ పటిష్టతకు, దేశానికి నిస్వార్థ సేవలు చేసి తమ జీవితాలను త్యాగం చేసిన పార్టీ వ్యవస్థాపక సభ్యులకు నివాళులు అర్పించారు. రావుల రాంనాథ్, సత్య నారాయణ గౌడ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షుడు ఆకుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
మండల జనరల్ సెక్రటరీ ఎంబడి సురేందర్, కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ రాకేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ పి.సంతోష్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. తాండూరు మండలం అచ్చులాపూర్‌లో నిర్వహించిన వేడుకల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌సభ్యుడు ఎన్.సుధీర్ గౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సతీశ్, బూత్ అధ్యక్షుడు హరీశ్ తదితరులు పాల్లొన్నారు.
మోడీ నాయకత్వాన్ని బలపర్చాలి
దేశ ప్రజల భవిష్యత్ కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పిలుపునిచ్చారు. ఆవిర్భావ వేడుకలు బెల్లంపల్లి పట్టణంలో, మండలంలోని లంబాడి తండాలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షురాలు దార కల్యాణి, సీనియర్ నేత అజ్మీర శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి గోవర్ధన్, అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ఇతర నేతలు పాల్గొన్నారు. ఖానాపూర్ లోని తెలంగాణ తల్లి చౌరస్తాలో పార్టీ జెండా ను నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ ఆవిష్కరించారు.