- ఆర్మూర్ కమిషనర్‌ను ప్రశ్నించిన బీజేపీ కౌన్సిలర్లు
ఆర్మూర్, వెలుగు: స్థానిక మోడల్ స్కూల్ వద్ద రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కు మొరం కోసం రూ.4లక్షల71వేలు చెల్లించి, కౌన్సిల్మీటింగులో ఆమోదం కోసం మొరం బిల్లును రూ.10 లక్షలుగా ఎందుకు పెట్టారని బీజేపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ ను కలిసి మెమోరాండం అందజేశారు.
అలాగే సోమవారం వాయిదా వేసిన కౌన్సిల్మీటింగ్ను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు బ్యావత్ సాయికుమార్, కొంతం మంజుల మురళీధర్, ఆకుల సంగీత శ్రీనివాస్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆఫీస్‌ను రియల్ ఎస్టేట్ ఆఫీస్‌గా మార్చి షాడో చైర్మన్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.