
గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత బీజేపీదేనని ఆ పార్టీ నాయకురాలు డీకే స్నిగ్దారెడ్డి తెలిపారు. ఆదివారం గట్టు మండలం హిందువాసి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బియ్యం పంపిణీ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, ప్రతి మనిషికి 5 కిలోలు కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేజీ మాత్రమే అదనంగా ఇస్తుందన్నారు.
పేదలకు ఇచ్చే సన్నబియ్యానికి అయ్యే ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.10 మాత్రమే చెల్లిస్తుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, కృష్ణవేణి, నాగప్ప, నల్లారెడ్డి పాల్గొన్నారు.