- కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్
న్యూఢిల్లీ: తర్వలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై పోటీకి మాజీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ ప్రకటించింది. న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి వీరిద్దరూ పోటీ పడుతున్నారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్బరిలో దిగుతు న్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారనుంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు 29 మంది అభ్యర్థులతో శనివారం బీజేపీ మొదటి లిస్ట్ విడుదల చేసింది.
జాబితా ప్రక టన తర్వాత పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లా డారు. తనపై నమ్మకంతో న్యూఢిల్లీ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ హైకమాండ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీ సీఎం అతీషి పోటీ చేస్తున్న కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజే పీ సీనియర్ నేత రమేశ్ బిదూరీ పోటీ చేయను న్నారు.
ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా బరిలో దిగుతున్నారు. ఢిల్లీ మాజీ రవాణా మంత్రి, కైలాశ్ గెహ్లాట్ బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవలే కైలాశ్ ఆప్ వదిలి బీజేపీలో చేరారు. 2003 నుండి 2013 వరకు షీలా దీక్షిత్ హయాంలో మంత్రిగా పనిచేసిన అరవిందర్ సింగ్ లవ్లీని.. బీజేపీ గాంధీనగర్ అభ్యర్థిగా బరిలో దించుతున్నది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీగా ఉండే చాన్స్ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.