8 సీట్లు గెలుచుకుని మా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది : ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్

8 సీట్లు గెలుచుకుని మా పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది : ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్
  • బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలోను కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ లోనూ కాంగ్రెస్ ను ఓడించారని,  ఆ పార్టీ గెలిచిన 8 స్థానాల్లోను రేవంత్ రెడ్డి పాత్ర నామమాత్రమేని విమర్శించారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దుర్భాషలడటం మానుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలు, విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.