కాంగ్రెస్​ సర్కారుపై వ్యతిరేకత మొదలైంది : రవికుమార్ యాదవ్

కాంగ్రెస్​ సర్కారుపై వ్యతిరేకత మొదలైంది : రవికుమార్ యాదవ్

కూకట్​పల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్​చార్జ్​ఎం.రవికుమార్​యాదవ్ విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చి ఏడాది అయిందంటూ మంగళవారం ఆల్విన్​కాలనీ, హైదర్​నగర్, వివేకానందనగర్​డివిజన్ల పరిధిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్​ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా రవికుమార్​మాట్లాడుతూ.. కాంగ్రెస్​పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని చెప్పారు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్​రావు, కో కన్వీనర్​మణిభూషణ్, నాయకులు రామరాజు, నరేందర్​రెడ్డి, నర్సింగ్​యాదవ్, కేశవ్, నర్సింహచారి, అరుణ్​కుమార్, కుమార్​యాదవ్, వేణుగోపాల్​యాదవ్ పాల్గొన్నారు.