బీజేపీ దగ్గర విజన్ ఉంది.. అందుకే జనం మా వైపు : తరుణ్ చుగ్

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన నడుస్తోందన్నారు బీజేపీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్.  బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు  బీజేపీలో చేరారు. వారికి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్, బండి సంజయ్ . ఈ సందర్బంగా మాట్లాడిన తరుణ్ చుగ్  లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలాడుతోందన్నారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ ఘటనలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్గించాలన్నారు. కేసీఆర్ నుంచి విముక్తి కల్గించే వరకు తమ  పోరాటం ఆగబోదన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..  కేసీఆర్ నయా నిజాం పాలనపై జనం వ్యతిరేకత ఉందన్నారు. నవంబర్లో కేసీఆర్ రిటైర్మెంట్ కానున్నారని చెప్పిన తరుణ్ చుగ్..  రేవంత్ రెడ్డి యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర విజన్ ఉందని.. అందుకే జనం తమ వైపు చూస్తున్నరని తెలిపారు. 

 రాష్ట్రంలో అన్నీ స్కాంలే:  బండి సంజయ్

అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని బండి సంజయ్  అన్నారు . టీఎస్ పీఎస్ సీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని.. నష్టపోయిన అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.  సిట్ పై తమకు నమ్మకం లేదని.. సిట్టింగ్ జడ్జిపైనే నమ్మకముందన్నారు.  టీఎస్ పీఎస్ సీ ఘటనపై వెనక్కి తగ్గేది లేదని.. పోరాటం ఇంకా ఉదృతం చేస్తామనిహెచ్చరించారు. రాష్ట్రంలో, బాన్సువాడలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు బండి సంజయ్.  రాష్ట్రంలో అన్నింట్లోనూ స్కాంలేనని ఆరోపించారు.  తానెప్పుడూ బూతులు మాట్లడలేదని.. తెలంగాణ భాషలో మాట్లాడిన అని చెప్పారు. భాషలో తనకు కేసీఆరే గురువని అన్నారు బండి సంజయ్.  ఏప్రిల్ 23న అమిత్ షా పార్లమెంట్ ప్రవాస్ లో భాగంగా చేవెళ్లకు వస్తున్నారని చెప్పారు.. అదే రోజు సాయంత్రం  బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు.