ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా 3 నెలలే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామంలో ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. కేసీఆర్ ఉపఎన్నికలు ఉంటే తప్ప ఫౌంహౌజ్ నుంచి బయటికిరాడని ఈటల విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టని ప్రభుత్వం.. విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందనుకోవడం భ్రమేనన్నారు. 

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తెలివైనవారని.. కేసీఆర్ జిమ్మిక్కులు బాగా అర్థమై ఉంటాయని ఈటల అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలచేతిలో కేసీఆర్కి పరాభవం తప్పదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల గోస ఏనాడూ పట్టించుకోలేదని.. ప్రజల సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలెప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.