ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బకొడతం : కె.లక్ష్మణ్

ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బకొడతం : కె.లక్ష్మణ్
  • ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులిస్తం: కె.లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: పహల్గాంలో పర్యాటకులను చంపిన ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బ కొడతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని చెప్పారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితులకు ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులిస్తామన్నారు. గతంలో సర్జికల్, ఎయిర్ స్ట్రైక్ జరిగాయని, అయినా వారిలో మార్పు రాలేదన్నారు. ముష్కరుల కోసం ఇప్పటికే జల్లడ పడుతున్నామని తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చిన్నాభిన్నమైందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి దాడులు చేపడుతోందని ఆయన ఆరోపించారు.