- ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రబారి
- బూర నర్సయ్యగౌడ్
వర్ని, వెలుగు: రాష్ట్రం లో సాగుతున్న కేసీఆర్తుగ్లక్పాలనను అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రభారీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వర్ని మండల కేంద్రంలోని ఓఫంక్షన్ హాల్లో శనివారం ప్రెస్మీట్నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ అప్పు, అవినీతి, అహంకార తెలంగాణగా మార్చారని ఫైర్అయ్యారు. లిక్కర్,పేపర్ల లీకేజీ స్కామ్‌లతో అంతా అవినీతిమయంగా మారిందన్నారు. కేసీఆర్‌కు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న 30 లక్షల మంది ఉసురు తగులుతుందన్నారు. ‘డబుల్’ ఇండ్ల పేరుతో లబ్ధిదారులకు ట్రిఫుల్‌ఆర్ సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతే వారిని ఆదుకోని సీఎం కేసీఆర్అని మండిపడ్డారు.
నియోజకవర్గాన్ని దోచుకుంటున్న స్పీకర్కుమారులు
స్పీకర్ పోచారం ఇద్దరు కుమారులు బాన్సువాడ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మొరం, కంకర, కాంట్రాక్టులు చేస్తూ నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని నర్సయ్య గౌడ్ఆరోపించారు. బీజేపీలో చేరాలనుకునే ఇతర పార్టీల లీడర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా అట్రాసిటీ కేసులు పెట్టిస్తూ పోలీస్‌వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్లీడర్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్బస్వా లక్ష్మీ నర్సయ్య, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జి మల్యాద్రిరెడ్డి, అరుణతార, శంకర్ పాల్గొన్నారు.
కేసీఆర్ ను దేవుడు కూడా క్షమించరు
పిట్లం, వెలుగు: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించకుండా సీఎం కేసీఆర్ గోస పెడుతున్నారని, ఆయనను దేవుడు కూడా క్షమించరని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. శనివారం జుక్కల్ నియోజక వర్గంలో బీజేపీ బూత్‌లెవల్ కమిటీ ప్రతినిధులతో బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఫసల్‌బీమా అమలు చేయకపోవడం వల్లనే రైతులు నష్టపోతున్నారని వాపోయారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, సెక్రెటరీ రాము, రాజు పాల్గొన్నారు.