హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి ఈ నెల 23, 24న మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తో శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియాతో ఏలేటి మాట్లాడారు.
మెంబర్ షిప్ డ్రైవ్ ను వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల స్ట్రాటజీపైనా చర్చించామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఈ నెల 25న నిరసనలు చేపడుతామని తెలిపారు.