యాదగిరిగుట్టలో బ్రిడ్జిని తొలగించండి : బీజేపీ నాయకులు

యాదగిరిగుట్టలో బ్రిడ్జిని తొలగించండి : బీజేపీ నాయకులు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జిని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యాదగిరిగుట్టలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వైకుంఠద్వారం నుంచి తహసీల్దార్ ఆఫీసు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మిర్యాల నరసింహారావును కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ యాదగిరిగుట్టలో పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠద్వారం వరకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి వల్ల పట్టణం రెండుగా చీలిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఈ బ్రిడ్జిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అచ్చయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సత్యం, పట్టణ కార్యదర్శి చంద్రమౌళి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బుచ్చిబాబు, బీసీ, కిసాన్, మహిళా మోర్చా అధ్యక్షులు నరేశ్, రాజిరెడ్డి, హేమలత తదితరులు పాల్గొన్నారు.