నస్పూర్ ఎస్సైపై హెచ్ఆర్​సీకి ఫిర్యాదు

నస్పూర్ ఎస్సైపై హెచ్ఆర్​సీకి ఫిర్యాదు

నస్పూర్‌‌, వెలుగు: నస్పూర్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలి జాతీయ మానవ హక్కుల కమిషన్​కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. గురువారం హైదరాబాద్​లోని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ విజయ భారతిని కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గత నెల 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రోజున నస్పూర్ తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద సీసీసీ ఎస్సై సుగుణాకర్.. తనపై చేయి చేసుకొని అవమానించి, చంపుతానని బెదిరించాడని బీజేపీ సీనియర్ నేత కమలాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అనంతరం ఎస్సై ప్రోత్సాహం తోనే కాంగ్రెస్ నేతలు అక్కడున్న బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారని, దాడిలో కొందరికి గాయాలైనట్లు పేర్కొన్నారు. కానీ పోలీసులు రాళ్ల దాడి చేసిన వారిపై కాకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పారు. మంచిర్యాలలో కొన్ని నెలలుగా దాడుల సంస్కృతి కొనసాగుతోందని, అధికార పార్టీ నాయకులు కొందరు యువకులను బ్యాచ్​గా ఏర్పాటు చేసి దాడులు చేపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన లపై పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అవమానించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కుర్రే చక్రవర్తి పాల్గొన్నారు.