వరి పంటలను పరిశీలించిన బీజేపీ నాయకులు

వరి పంటలను పరిశీలించిన బీజేపీ నాయకులు

బోధన్​,వెలుగు : బోధన్​ మండలంలోని ఊట్ పల్లి, అమ్దాపూర్​ శివారులోని డీ-40 కెనాల్​ కింద ఉన్న వరిపంటను బీజేపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  డీ-40కెనాల్ ద్వారా నిజాంసాగర్​ నీరు వదిలి 12రోజులైన  పొలాలకు నీరు అందలేదన్నారు. వరి పంటలు పొట్టదశలో ఉన్నాయన్నారు.  

బోరుబావులు ఉన్న రైతులకు ప్రతినెలా రూ. 5 వేలు ఇచ్చి సాగునీరు తీసుకుంటున్నారన్నారు. ఇరిగేషన్ అధికారులకు అడిగితే హోలీ పండుగ తర్వాత సాగునీరు వదులుతామని చెబుతున్నారని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన ఇరిగేషన్​ అధికారులు స్పందించి సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.