మన్​ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

మన్​ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

ఆర్మూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ చూడాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్​లో ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి నివాసంలో మన్ కి బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు  వీక్షించారు.  ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని గంగారెడ్డి చెప్పారు. 

ప్రధాని మోదీ దేశంలో జరుగుతున్న ఎన్నో విషయాలను ఈ కార్యక్రమాలతో  ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ మందుల బాలు, సీనియర్ నాయకులు పుప్పాల శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, మందుల పోశెట్టి, పోల్కం వేణు, ద్యాగ ఉదయ్, సూరత్ శ్రీకాంత్, గుగులోత్ తిరుపతి నాయక్,  కలిగోట్ ప్రశాంత్, ప్రసన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.