
మెదక్‌టౌన్, వెలుగు: ఈ నెల 6న నిర్వహించే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్వాల్దాస్మల్లేశ్గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మెదక్ పట్టణంలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పార్టీ ఆఫీసులో ఆయన ఫొటోఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త వారి ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలన్నారు.
13, 14 తేదీల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్సెక్రెటరీలు శ్రీనివాస్, లక్ష్మీ నర్సింహారెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీశ్, జిల్లా కన్వీనర్ సుభాష్ గౌడ్, సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సిద్ధిరాములు, రంజిత్ రెడ్డి, నారాయణ రెడ్డి, శంకర్, రాజు, రాంరెడ్డి, నవీన్ పాల్గొన్నారు.