బీజేపీలో చెత్త పోతేనే.. రాష్ట్రంలో అధికారం : ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీలో చెత్త పోతేనే.. రాష్ట్రంలో అధికారం : ఎమ్మెల్యే రాజాసింగ్
  • ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోని కొంత చెత్త బయటికి వెళ్లిపోతేనే.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒవైసీ దేశం విడిచి పోతాడని.. లేకపోతే బీజేపీలో చేరుతానని తమ కాళ్లపై పడతారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  రంజాన్ మాసంలో కూడా ఒవైసీ హిందువులపై విషం కక్కుతున్నారని విమర్శించారు. 

హోళీ పండగ నేపథ్యంలో శుక్రవారం రోజు జుమ్మా నమాజ్ ఇంట్లో చేసుకోవాలని యూపీ సీఎం యోగి సూచించడంపై ఒవైసీ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒవైసీని మెంటల్ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధి నిర్వహణకు నిధులు కేటాయించొద్దని రాజాసింగ్ కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు లేఖ రాశారు. సమాధి నిర్వహణకు ఎంత ఖర్చు చేశారనే వివరాలు వెల్లడించాలని కోరారు.