అక్రమ నిర్మాణాలు చేపట్టిన రియల్ కంపెనీలపై చర్యలు తీస్కోండి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

అక్రమ నిర్మాణాలు చేపట్టిన రియల్ కంపెనీలపై చర్యలు తీస్కోండి  : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
  • రియల్ కంపెనీలపై చర్యలు తీస్కోండి
  • హైడ్రా, రెరా, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, బల్దియాకు కామారెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  అక్రమ నిర్మాణాలు చేపట్టిన 4 రియల్ ఎస్టేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళవారం బుద్ధభవన్ లోని హైడ్రా ఆఫీసులో కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

4 కంపెనీలు చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, ఈ అంశంపై 2 నెలల క్రితమే వివరాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. శేరిలింగంపల్లి గోపన్ పల్లిలో వజ్రమ్ ఎక్సోరా, రాజేంద్రనగర్ లో ద ప్రెస్టేజ్ సిటీ హైదరాబాద్ అపార్ట్ మెంట్స్ అండ్ విల్లాస్, గండిమైసమ్మలో ప్రణీత్ ప్రనవ్ గ్రోవ్ పార్క్, నార్సింగిలో ఫోనిక్స్ 285 ఎఫ్డీ సంస్థల నిర్మాణాలపై హైడ్రాతో పాటు రెరా, టీజీఐఐసీ,హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలకు  ఫిర్యాదు చేశానని తెలిపారు.