భైంసా అల్లర్లపై అమిత్ షాకు ఆదిలాబాద్ ఎంపీ ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. భైంసా అల్లర్లపై ఫిర్యాదు చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందని వివరించారు. మార్చిలో జరిగిన అల్లర్లలో 30 మంది హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని వివరించారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి హిందువులపై కేసులు పెడుతున్నారు చెప్పారు సోయం బాపురావు. భైంసా ఘటన సీబీసీఐడీతో విచారణ చేయించాలని అమిత్ షాను కోరామన్నారు ఎంపీ.

మరోవైపు పోడు భూములకు వ్యవసాయ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో ఈ నెల 30 న ఆందోళన చేపడతామన్నారు బాపురావు. పోడు వ్యవసాయం చేస్తున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలుపుతామన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి  రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. బీసీలకు ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి...  అమలు చేయడం లేదన్నారు బాపురావు. ఈ హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్ తో  ఈ నెల 30 న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.