రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాలి : ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్

రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాలి : ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో  విఫలమై, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు ఆర్థిక నిర్ణయాలు, దుబారా ఖర్చులు, రాజకీయ నియామకాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, తక్షణమే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి, తక్షణమే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేస్తున్నామని, ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికీ తీసుకెళ్తామని ఎన్వీఎస్ఎస్ తెలిపారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా గుల్లకావడంతో ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభాకర్ పేర్కొన్నారు.