తెలంగాణ పోలీసులు పింక్ డ్రెస్ వేసుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. సీఎం కేసీఆర్ సూచనలతో ఇదంతా జరిగిందన్నారు. మనసులో ద్వేషంతో క్రిమినల్ మైండ్ తోనే ఎంపీ కార్యాలయంపై దాడి చేసారని తరుణ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకొస్తమన్నారు. కానీ మాట తప్పారన్నారు. ద్రౌపది వస్త్రాపహరణంతో మహాభారత యుద్ధం వచ్చిందన్నారు. కరీంనగర్ లో కూడా కొందరు పోలీసులు దుర్యోధనుడు దుశ్శాసనునిలా మారి మా కార్యకర్తలను అవమానించారన్నారు. వీటన్నింటికీ కచ్చితంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సమాధానం చెప్పి తీరుతామన్నారు. బండి సంజయ్ పై కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామన్నారు. జాగరణ దీక్షను జలియన్ వాలా బాగ్ లా మార్చారని తరుణ్ చుగ్ మండి పడ్డారు. ఒక్కో మహిళా కార్యకర్త మీద జరిగిన దాడికి సమాధానం చెబుతామన్నారు.
ప్రశాంతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను కోవిద్ నిబంధనల పేరుతో అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసులు పింక్ కలర్ బార్బీ డాల్స్ లా మారారన్నారు. వాళ్లంతా కేసీఆర్ ఆడించినట్లు ఆడుతున్నారన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. తాము ప్రజా క్షేత్రంలో ఉండి పోరాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏసీ రూం లలో ఉండి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల్ని రక్షించాల్సిన కరీంనగర్ సీపీ భక్షిస్తున్నాడని విమర్శించారు. కరీంనగర్ లో పోలీసులు గూండా గిరి చేస్తున్నారన్నారు. జనరల్ డయ్యర్ వ్యవహరించినట్లు కరీంనగర్ సీపీ వ్యవహరించారని విమర్శలు చేశారు. కరీంనగర్ లో పోలీసుల తీరుపై గవర్నర్ తో పాటు.. కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరీంనగర్ దౌర్జన్య కాండపై ఫిర్యాదు చేస్తామన్నారు.
మహిళా కార్యకర్తలపై దౌర్జన్యంగా వ్యవహరించారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. బీజేపీ కార్యకర్తలపై జరిగినప్రతీ దాడిని గుర్తించుకుంటామన్నారు.ఇవాళ మాజీ సీఎం రమణ్ సింగ్ వస్తున్నారన్నారు. రేపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరీంనగర్ కు వస్తారన్నారు. అంతకుముందు ఆయన జైలులో ఉన్న బీజేపీ నేతల్ని పరామర్శించారు.
ఇవి కూడా చదవండి:
పార్టీ పరువు పోతుందని రాఘవను అరెస్ట్ చేయట్లేరు
ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి