
- గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- నిందితులపై చర్యలు తీసుకోవాలి
- అరెస్ట్ చేసిన హిందూ సంఘాల నేతలను విడుదల చేయాలి
- 3 నెలల్లో 15 మందిరాల మీద దాడులు జరిగాయి
- రాష్ట్రంలో అలజడులకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసిన హిందూ సంఘాల నేతలను విడుదల చేయాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమ వారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. గుడిపై దాడి ఘటనను ఖండిస్తూ నిరసన చేపట్టిన హిందూ సంఘాల నేతలపై పోలీ సులు లాఠీచార్జ్ చేశారని, అక్రమ కేసులు పెట్టారని గవర్నర్‌కు వివరించారు. బాధ్యు లైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నా రు. ముత్యాలమ్మ గుడి ఘటనను ఎన్ఐఏ కు అప్పగించాలని, డీజీపీ నుంచి పూర్తి నివేదిక తెప్పించుకోవాలని వారు కోరారు.
అనంతరం డీజీపీ జితేందర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి ఖండించలేదని అన్నారు. ‘‘దేవాలయాల మీద దాడి జరిగితే మా తల్లి మీద దాడిలా భావిస్తాం. దాడులను సహించేది లేదు” అని చెప్పారు.
ఆలయంపై దాడి చేసిన నిందితుల మీద ప్రభుత్వం ఎం దుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. హైద రాబాద్‌లో అలజడులకు కుట్రలు జరుగుతు న్నట్లు తెలుస్తున్నదని, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 3 నెలల వ్యవధిలో 15 మందిరాల మీద దాడులు జరిగాయని చెప్పారు. గవర్నర్‌ను కలిసినవారిలో బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తదితరులు ఉన్నారు.