సంక్రాంతికి వస్తున్నాం నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. వెంకీ మామ అదరగొట్టేశాడు...

సంక్రాంతికి వస్తున్నాం నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. వెంకీ మామ అదరగొట్టేశాడు...

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఈ సినిమాకి ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఎస్విసి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత శిరీష్ నిర్మిస్తున్నాడు. వెంకటేష్ కి జంటగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. 

సోమవారం ఈ సినిమాలో థర్డ్ సింగిల్ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ ని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా  'విక్టరీ' వెంకటేష్, భీమ్స్ సిసిరోలియో, 'మాయిపిలో' రోహిణి సోరట్ తదితరులు కలసి పాడారు. గొబ్బియల్లో అంటూ మొదలయ్యే లిరిక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక వెంకీమామ వాయిస్ అమేజింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గోదారి గట్టున రామసిలకవే సాంగ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఈ పాట ని ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, ప్రముఖ సింగర్ మధుప్రియ పాడారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 3 వారాల్లోనే 56 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ALSO READ | ఏంటీ.. ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ రైట్స్ రూ.250 కోట్లా..?