న్యూఢిల్లీ: వీసా ప్రాసెసింగ్, ట్రావెల్ సర్వీస్‌లు అందించే బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌ఎల్‌డబ్ల్యూ మీడియాలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ. 80.24 లక్షలు. ఈ డీల్‌తో తమ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని బీఎల్‌ఎస్ ఇంటర్నేషన్ జాయింట్ ఎండీ శిఖర్ అగర్వాల్ పేర్కొన్నారు. గ్లోబల్‌గా తమ పొజిషన్ బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఎస్‌ఎల్‌డబ్ల్యూ మీడియా మేనేజ్ చేసే గోల్ఫ్ ఈవెంట్స్‌కు, వీసా, ట్రావెల్ సర్వీస్‌లు అందించడానికి బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్‌కు వీలుంటుంది.