
యాపిల్ కంపెనీ ప్రతీ సంవత్సరం డబ్ల్యూడబ్ల్యూడిసి (వరల్డ్ వైడ్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్) ప్రోగ్రామ్ పెడుతుంది. దాంట్లో వాళ్ల నుంచి రాబోతున్న కొత్త టెక్నాలజీ, మొబైల్స్ ల్యాప్‌టాప్, గాడ్జెట్స్ గురించి చెప్తారు. అయితే డబ్ల్యూడబ్ల్యూడిసి 2022 ప్రోగ్రామ్‌లో యాపిల్ మొబైల్స్ కోసం కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఇది వరకు ఒక యాపిల్ మొబైల్‌లో ఉన్న ఇ– సిమ్ ఇంకొక యాపిల్ మొబైల్‌లో వేయాలంటే సిమ్ ప్రొవైడర్‌ల దగ్గరికో, సిమ్ స్టోర్‌లకో తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు వచ్చే ఐఓఎస్ 16 అప్‌డేట్‌లో ఇ– సిమ్ వేరొక యాపిల్ మొబైల్‌లోకి వేయాలంటే స్టోర్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. ఫోన్‌లో ఉన్న బ్లూటూత్ సాయంతోనే ఇ– సిమ్ ఇంకొక మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. కాకపోతే ఈ ఫీచర్ ఐఓఎస్ 16 అప్‌డేట్ చేసుకున్నవాళ్లకే పని చేస్తుంది. అంతేకాకుండా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. అంటే కావాల్సినట్టు లాక్ స్క్రీన్‌లో టైం, డేట్, వెదర్ రిపోర్ట్, ఫాంట్‌లను మార్చుకోవచ్చు.