జర్మనీ లగ్జరీ కార్ బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్‌లో ఎం5 కాంపిటిషన్ ‘50 జహ్రే ఎం ఎడిషన్’ని రూ.1.8 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌గా భారతదే శానికి వస్తుంది. ఈ సెడాన్ కోసం బుకింగ్‌లను ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు.
ఎం5 కాంపిటిషన్ '50 జహ్రే ఎం ఎడిషన్' 10 యూనిట్లను మాత్రమే అమ్ముతారు. అడాప్టివ్ స్పెసిఫిక్ సస్పెన్షన్, స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్, హై-పెర్ఫార్మెన్స్ కాంపౌండ్ బ్రేక్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. జహ్రేలోని ఇంజన్ 625 హెచ్‌పీని, 750 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. 0--100 కి.మీ వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది.
బీఎండబ్ల్యూ సెకెండ్ జనరేషన్ ఎం2 కారులో ఆటోమేటిక్, మేన్యువల్ ఆప్షన్స్ ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి. బీఎండబ్ల్యూ 1ఎంకు సక్సెసర్ గా పిలిచే టర్బో సూపర్ కూపన్ లో ఎస్58 పవర్ యూనిట్ ఉంది. 2.0 లీటర్ టర్బో చార్జ్ ఇన్ లైన్ 6 సిలిండర్ ఇంజిన్ ప్రత్యేకత. 6 స్పీడ్ మేన్యువల్ లేదా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ .. ఈ గేర్ బాక్స్ లో4.1- సెకండ్లలో 0.60 ఎంపీహెచ్ కి వెళుతుంది. ఆటోమేటిక్ లో అయితే 3.9 సెకండ్లు పడుతుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగం సామర్థ్యం ఉంది.