
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ ..ఓ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం బోల్తా పడింది.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. అయితే తన పర్యటన ముగించుకుని కాన్వాయ్ లో తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వెహికల్ ఏటూరునాగారం వైపు వస్తున్న బొలెరో గూడ్స్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం బోల్తా పడింది. తాడ్వాయి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎవరికి గాయాలు కాకపోవడంతో అధికారులు ఉపిరిపీల్చుకున్నారు.