
అస్సాం హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం గౌహతి హైకోర్టు ప్రాంగణాన్ని పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ పంపించారు. బెదిరింపులు రావడంతో కోర్టు కార్యకలాలు కొద్ది సమయం పాటు నిలిచిపోయాయి. రిజిస్ట్రార్ వ్యక్తిగత జీమెయిల్ ఖాతాకు వచ్చిన ఈ ఆందోళనకరమైన ఇమెయిల్ ను వెంటనే భద్రతా సంస్థలకు సమాచారం అందించింది. బెదిరింపు సమాచారం అందిన కొద్దిసేపటికే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్స్ , స్నిఫర్ డాగ్స్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కోర్టు ప్రాంగణం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అనుమానస్పద పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకుర్ జైన్ తెలిపారు.
ఈమెయిల్ లోని విషయాలు, పంపిన వ్యక్తిని డిటైల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా హైకోర్టు లోపల, బయట చుట్టు పక్కల భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఏడాదిలో గౌహతిలో ఇది రెండో బాంబు బెదిరింపు ఘటన. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా నగరంలో పలుచోట్లు పేలుడు పదార్థాలు ఉన్నాయని ఫేక్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతరాయం కలిగింది. ఆ బెదిరింపు కూడా తరువాత ఫేక్ అని తేలింది.
►ALSO READ | గుజరాత్ లో విమానం ప్రమాదం..జనవాసాల్లో కూలిన ప్రైవేట్ ఫ్లైట్..భయంతో పరుగులు పెట్టిన జనం
దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింంపు కాల్స్ పెరుగుతున్న క్రమంలో మంగళవారం గౌహతి హైకోర్టు బాంబు బెదిరింపులు భయాందోళనకు గురిచేశాయి. సోమవారం కూడా ఢిల్లీలోని కపషేరా, ద్వారక, నజాఫ్ గడ్ లోని అనేక సబ్ డివిజినల్ మేజిస్ర్టేట్ ఆఫీలసులకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే అవి ఫేక్ మెయిల్స్ అని తేలింది.
అయితే గౌహతి హైకోర్టు ఫేక్ బెదిరింపులు ఈమెయిల్స్ ను అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. నకిలి బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని ఎంతటివారైన వదిలిపెట్టమని అధికారులు చెబుతున్నారు.ఈ బెదిరింపులపై దర్యాప్తు కొనసాగుతోంది.. గౌహతి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అధికారులు అన్నారు.