పాక్​లో ఆత్మాహుతి దాడి.. 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4 మంది మృతి

పాక్​లో ఆత్మాహుతి దాడి.. 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4 మంది మృతి

 

  • పాక్​లో ఆత్మాహుతి దాడి.. 4‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌4 మంది మృతి 
  • 4‌‌4 మంది మృతి.. 200కుపైగా మందికి గాయాలు  
  • ఇస్లామిక్ పార్టీ జేయూఐ–ఎఫ్ లక్ష్యంగా అటాక్
  • బహిరంగసభలో తనను తాను పేల్చేసుకున్న సూసైడ్ బాంబర్ 
  • కాళ్లు, చేతులు తెగి.. మాంసపుముద్దలుగా మారిన జనం

పెషావర్:   పాకిస్తాన్​లో ఓ ఇస్లామిక్ రాజకీయ పార్టీ మీటింగ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. వందలాది మంది హాజరైన బహిరంగ సభలో వేదికకు సమీపంలోనే ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకోవడంతో 44 మంది మృత్యువాతపడ్డారు. 200కుపైగా మంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అఫ్గానిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బజౌర్ జిల్లా ఖర్ పట్టణంలో జమైత్ ఉలేమా ఇ ఇస్లామ్–ఫజల్(జేయూఐ–-ఎఫ్) పార్టీ మీటింగ్​లో ఈ అటాక్ జరిగింది. క్షతగాత్రుల్లో చాలామంది సీరియస్ కండీషన్​లో ఉన్నారని, మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసులు తెలిపారు. 

పేలుడు ధాటికి జనం చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. చాలా మందికి కాళ్లు, చేతులు తెగిపోయాయి. ఒళ్లంతా గాయాలతో రక్తమోడుతున్న వారిని అంబులెన్స్​లలో తరలిస్తున్న దృశ్యాలు లోకల్ టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలోనూ దాడి దృశ్యాలు వైరల్ అయ్యాయి. గాయపడిన వాళ్లలో 17 మందికి సీరియస్​గా ఉందని ఖైబర్ పఖ్తుంఖ్వా హెల్త్ మినిస్టర్ రియాజ్ అన్వర్ మీడియాకు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ‘‘పార్టీ నాయకుల రాక కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. నేను ఎగిరిపడిపోయాను. లేచి చూసేసరికి చేతులు తెగిపోయి రక్తమోడుతున్న ఓ వ్యక్తి పక్కన ఉన్నాను. ఎటు చూసినా రక్తమాంసాల వాసనతో నిండిపోయింది” అని దాడిలో గాయపడిన వ్యక్తి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ టెర్రరిస్ట్ సంస్థా ప్రకటించుకోలేదు.

అఫ్గాన్​లో తాలిబాన్లు వచ్చాకే.. 

అఫ్గానిస్తాన్​లో 2021లో తాలిబాన్లు రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశమైన పాకిస్తాన్​లో మళ్లీ టెర్రర్ దాడులు పెరిగాయి. అల్ కాయిదాకు సన్నిహితంగా ఉండే తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) వరుస దాడులకు పాల్పడుతోంది. జనవరి 30న పెషావర్​లోని మసీదు వద్ద టీటీపీ సూసైడ్ బాంబర్ దాడిలో 101 మంది చనిపోయారు. ఫిబ్రవరిలో మిలిటెంట్లు కరాచీ పోలీస్ చీఫ్ ఆఫీసుపైనే కాల్పులకు తెగబడ్డారు.

ఇస్లామిక్ గురువు  పెట్టిన పార్టీ..  

దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాల ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ను జేయూఐ-ఎఫ్ అధ్యక్షుడు మౌలానా ఫజలుర్ రెహమాన్ డిమాండ్ చేశారు. తాను వేరే పని కారణంగా ఈ మీటింగ్​కు రానందున ప్రాణాలతో బయటపడ్డానని మరో నేత హఫీజ్  హమ్దుల్లా చెప్పారు. ఇది జిహాద్ కాదని.. టెర్రరిజమేనని మండిపడ్డా రు. మౌలానా ఫజలుర్ రెహమాన్ మొదట్లో కరుడుగట్టిన ఇస్లామిక్ మత గురువుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మసీదులు, మదర్సాలు నడుస్తున్నాయి. కొన్నేండ్ల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించి న ఆయన కేంద్రంలో కింగ్ మేకర్ గా మారి ఏ ప్రభుత్వం వచ్చినా అందులో భాగస్వామి గా చేరుతున్నారు. అయితే, ఇస్లాం పేరుతో ఆయన లౌకిక పార్టీలతో చేతులు కలిపా రంటూ పాక్​లోని ఐఎస్ టెర్రరిస్టులు ఇదివరకే ఈ పార్టీపై దాడులకు పాల్పడ్డారు. వచ్చే అక్టోబర్, నవంబర్​లో ఫెడరల్ ఎలక్షన్స్ ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగానే జేయూఐ-ఎఫ్ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయగా ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.