జగిత్యాలలో బాలుడి కిడ్నాప్నకు యత్నం.. దుండగుడికి దేహశుద్ది చేసిన స్థానికులు

జగిత్యాల జిల్లాలో బాలుడి కిడ్నాప్కు యత్నించిన వ్యక్తికి దేహశుద్ది చేశారు స్థానికులు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని వాణినగర్లో 12ఏళ్ల బాలుడు రాజును ఎత్తుకెళ్లేం దుకు అలీ అనే వ్యక్తి యత్నించాడు. ఇంటి బయట ఆడుకుంటుండగా మాటలు కలిపి తన వెంట తీసుకెళుతుండగా రాజును గుర్తించిన స్థానికులు అలీని నిలదీశారు.  అలీ పొంతన లేని సమాధానం చెప్పి తప్పించుకనే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, రాజు కుటుంబ సభ్యులు అలీకి దేహ శుద్ధి చేశారు.