
ఎల్బీనగర్, వెలుగు: హైడ్రా ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేత, బడంగ్ పేట్ మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డితో పాటు బోయపల్లి వెంకట్ రెడ్డి, బోయపల్లి మణికాంత్ తో పాటు మరికొందరిపై మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్ స్పెక్టర్ కీసర నాగరాజు వివరాల ప్రకారం.. బడంగ్ పేట్ పరిధిలోని బోయపల్లి ఎన్ క్లేవ్ లేఅవుట్లో 236 గజాల పార్క్ స్థలంతో పాటు కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా రోడ్డును కబ్జా చేసి ప్రీ కాస్ట్ నిర్మించారు. దీనిపై హైడ్రా ఇన్ స్పెక్టర్ తిరుమలేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో బోయపల్లి శేఖర్ రెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.