బీఆర్ఎస్ లో అసంతృప్త సెగలు ఆగడం లేదు. చాలా చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో నియోజకవర్గాల్లో టికెట్లు రాని నేతలు తిరగబడుతున్నారు. నియోజకవర్గాల్లో వర్గాలుగా విడిపోయి విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిష్టానం అభ్యర్థులను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పరకాల బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికే కేటాయించారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాగూర్ల వెంకన్నకు టికెట్ కేటాయించాలన్నారు. సీఎం కేసీఆర్ పరకాల టికెట్ కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రెండుసార్లు అవకాశం కల్పించారు కాబట్టి... ఈ సారి నాగుర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగూర్లకు టికెట్ ఇవ్వకపోతే త్వరలో భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు.