ఎమ్మెల్యేలు లేరు.. ఎమ్మెల్సీలు పనిచేస్తలేరు

  • ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లా ఎమ్మెల్సీలు ఇన్‌‌‌‌ఆక్టివ్‌‌‌‌
  • వరంగల్‌‌‌‌, మహబూబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్లలో ఒక్క ఎమ్మెల్యే లేని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌
  • అంటీముట్టనట్లు ఉంటున్న ఐదుగురు ఎమ్మెల్సీలు

వరంగల్‍, వెలుగు : ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకు చెందిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీలు యాక్టివ్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి రావడం లేదు. వరంగల్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్ల పరిధిలో ఆ పార్టీకి అసలు ఎమ్మెల్యేలే లేకపోగా, ఉన్న ఎమ్మెల్సీలు కూడా సైలెంట్‌‌‌‌ అయ్యారు. దీంతో లోక్‌‌‌‌సభ ఎన్నికలను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు లైట్‌‌‌‌ తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఓరుగల్లుకు అత్యధికంగా ఏడు ఎమ్మెల్సీ పోస్టులు

ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే క్రమంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హైకమాండ్‌‌‌‌ ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఏడుగురికి సత్యవతి రాథోడ్‍, బండా ప్రకాశ్‍, పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్‍రావు, పల్లా రాజేశ్వర్‍రెడ్డి, కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇందులో సత్యవతి రాథోడ్‍కు మంత్రి పదవి కేటాయించగా, పల్లాను రైతు సమన్వయ సమితి కన్వీనర్‍, బండా ప్రకాశ్‌‌‌‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌గా నియమించారు. 

వరంగల్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌లో ఎమ్మెల్యేలే లేరు

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి, కడియం శ్రీహరి స్టేషన్‌‌‌‌ ఘన్‌‌‌‌పూర్‌‌‌‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. కడియం శ్రీహరి ఇటీవల కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పల్లా రాజేశ్వర్‍రెడ్డి ఒక్కరే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే జనగామ భువనగిరి పార్ల