గవర్నర్ ప్రసంగం మధ్యలో BRS సభ్యుల నినాదాలు.. ఎందుకంటే..?

గవర్నర్ ప్రసంగం మధ్యలో BRS సభ్యుల నినాదాలు.. ఎందుకంటే..?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. 2025, మార్చి 12 ఉదయం 11 గంటలకు బడ్జెట్ సెషన్ ప్రారంభం కాగా.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా స్పీచ్ మధ్యలో ప్రతి పక్ష బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు రూ.500 బోనస్, కృష్ణా నది జలాల ప్రస్థావన వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ స్పీచ్ కంటిన్యూ చేశారు.

మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని.. బడ్జెట్ లో విద్యా రంగానికి 30 శాతం కేటాయించాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్వీ నేతల ఆందోళనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

ALSO READ | మహాలక్ష్మీ గేమ్ ఛేంజర్.. ప్రజలే కేంద్రంగా పాలన: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ