కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చేస్కోనియ్యండి.. : హరీశ్ రావు

కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చేస్కోనియ్యండి.. : హరీశ్ రావు

ఫార్ములా ఈ రేసు కేసులో.. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయటం.. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై.. ఫుల్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనేది మా లాయర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారాయన. 

హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ, ఈడీ విచారణకు సహకరిస్తామని.. పారిపోయేది లేదని వెల్లడించారు హరీశ్ రావు. కక్షపూరితంగా.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై కేసు పెట్టారంటూ విమర్శించారాయన. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోమనివ్వండి.. భయపడేది లేదన్నారు హరీశ్ రావు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో అవినీతే జరగలేదని.. నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ కో సంస్థకు వెళ్లలేదని.. అవినీతి లేనప్పుడు విచారణకు ఎందుకు భయపడతాం అన్నారు హరీశ్. విచారణ ఎదుర్కోవటానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు హరీశ్ రావు.

రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కేసులు పెట్టొచ్చని.. ఒత్తిళ్లు రావొచ్చని.. అయినా వెనక్కి తగ్గేది లేదన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే.. ఆరు గ్యారంటీపై నిలదీస్తున్నందు వల్లే అక్రమ కేసులు పెడుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు హరీశ్ రావు.

Also Read:-కేటీఆర్ విదేశాలకు పారిపోతాడు..పాస్పోర్టు సీజ్ చేయాలి..

ఫార్ములా ఈ రేసు కేసు అనేది ఓ తుఫేల్ కేసు అని.. ఇది కోర్టుల్లో నిలబడదు అంటూ జోస్యం చెప్పారు హరీశ్ రావు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే ఫార్ములా ఈ కారు రేసు పెట్టాం అని.. ఇదేమీ సొంతానికి పెట్టింది కాదంటూ వివరించారు హరీశ్ రావు. జనవరి 9వ తేదీన ఏసీబీ విచారణ ఉందని.. ఆ రోజు విచారణకు కేటీఆర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు హరీశ్ రావు.

కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే చేస్కోనివ్వండి.. కోర్టులోనే తేల్చుకుంటాం అన్నారు హరీశ్ రావు.