పీసీసీ చీఫ్​ ఓ డమ్మీ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​

పీసీసీ చీఫ్​ ఓ డమ్మీ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్​ లేఖ రాయాల్సి వస్తే.. సీఎం రేవంత్​ తప్పిదాలపైన రాయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​అన్నారు. మహేశ్​గౌడ్​ పీసీసీ చీఫ్ కాదని, పప్పెట్​లా మారారని విమర్శించారు. రేవంత్​కు రాసిన లేఖను మరిచిపోయి కేసీఆర్​కు పంపారేమోనని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

ప్రస్తుత పీసీసీ చీఫ్​ ఓ డమ్మీ మాత్రమేనన్నారు. గతంలో పీసీసీ చీఫ్​లు.. వారి సీఎంల పనితీరు బాగా లేకుంటే బహిరంగంగానే చెప్పేవారని, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సెషన్​లో కాంగ్రెస్​అడిగే అన్ని ప్రశ్నలకు బీఆర్​ఎస్​బదులిస్తుందన్నారు. సీఎం రేవంత్​ తప్పుల వల్ల కాంగ్రెస్​ మరో 20 ఏండ్లు అధికారానికి దూరమయ్యే పరిస్థితి 
ఏర్పడిందన్నారు.