పువ్వాడ, ఆర్జేసీ కృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

పువ్వాడ, ఆర్జేసీ కృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ తో కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును కవిత పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ ని అడిగి తెలుసుకున్నారు. 

అంతకుముందు ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​, బీఆర్ఎస్​ నేత గుండాల కృష్ణ (ఆర్జేసీ కృష్ణ) ను కవిత పరామర్శించారు. కాల్వొడ్డు సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జాగృతి నాయకురాలు గట్టు అరుణ కుమారుడి రిసెప్షన్​ కు హాజరయ్యారు. నూతన దంపతులు సాయి వివేక్​, పావనిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హరిప్రియ, మదన్​ లాల్ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి కల్లూరు మండలం లింగాలలో తెలంగాణ జాగృతి నాయకుడు దేవరపల్లి పట్టాభిరామ్​ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.